News February 17, 2026

100 ఎకరాల్లో జినోమ్ వ్యాలీ ఫేజ్-4: శ్రీధర్ బాబు

image

TG: జినోమ్ వ్యాలీని విస్తరిస్తూ ఫేజ్-4ను 100 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘లైఫ్ సైన్సెస్ రంగంలో 2035 నాటికి $25B పెట్టుబడుల లక్ష్యంగా ప్లాన్ రూపొందించాం. Trident AI కంపెనీ (US) ₹300CR, Rx Propellant ₹1000CR పెట్టుబడి పెడుతున్నాయి. Opella (France) కంపెనీ ముందుకొచ్చింది. AI ఆధారిత డ్రగ్స్ డిస్కవరీలో యువతకు శిక్షణ ఇప్పిస్తాం’ అని బయో ఆసియా-2026 సదస్సులో తెలిపారు.

Similar News

News February 18, 2026

స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు కోల్పోయి 83,399 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 25,719 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, HCL టెక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, బెల్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

News February 18, 2026

గతంలోనూ పలుమార్లు YouTube డౌన్

image

యూట్యూబ్ <<19172024>>ఇవాళ<<>> డౌన్ అవడంతో యూజర్లు లక్షల సంఖ్యలో కంపెనీకి రిపోర్ట్ చేశారు. గతంలోనూ పలుమార్లు దీని సేవలకు అంతరాయం ఏర్పడింది. 2008 ఫిబ్రవరిలో పాకిస్థాన్ టెలికం తప్పుగా YouTube IPలను బ్లాక్ చేయడం వల్ల గ్లోబల్‌గా 2 గంటలు డౌన్ అయింది. 2019 అక్టోబర్, 2020లో నవంబర్, డిసెంబర్‌లో సర్వర్ సమస్యలు తలెత్తాయి. 2025 అక్టోబరులోనూ US, UK, కెనడా, ఆస్ట్రేలియాలో సేవలు నిలిచిపోయాయి.

News February 18, 2026

Lupus: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?

image

కొందరిలో రోగనిరోధక వ్యవస్థ గాడితప్పి హానికారకాలకు, ఆరోగ్య కణజాలానికి మధ్య తేడాను గుర్తించలేదు. దీంతో యాంటీబాడీలు మన శరీర కణజాలం మీదే దాడి చేస్తాయి. దీన్నే లూపస్ అంటారు. ఇదొక ఆటోఇమ్యూన్ డిసీజ్. లూపస్‌తో బాధపడేవారు చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తారు. నిస్సత్తువ, జ్వరం, నోట్లో పుండ్లు వంటి లక్షణాలు ఉంటాయి. కానీ జబ్బు నిర్ధరణ అయ్యేసరికే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి అవయవాలు దెబ్బతింటాయి.