News December 4, 2025

100% పన్నులు వసూలు చేయాలి: ASF కమిషనర్

image

ASF పట్టణంలో 100% పన్నులు వసూలు చేయలని మున్సిపల్ కమిషనర్ గజానంద్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటి, నీటి, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై సిబ్బందితో గురువారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం 2024 -25 వరకు చెల్లించిన ఇంటి పన్ను మ్యానువల్ రిసిప్టులను ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లించాలని వివరించారు.

Similar News

News December 5, 2025

పల్లె టు కాశ్మీర్.. సరిహద్దులో కొండంరాజుపల్లి బిడ్డ

image

సిద్దిపేట జిల్లా కొండంరాజపల్లి గ్రామానికి బండి లక్ష్మి- తిరుపతి దంపతుల కుమారుడు బండి శ్రీనివాస్ అగ్నివీర్ పథకంలో దేశసేవకు అంకితమయ్యాడు. బెంగళూరులో ఆరు నెలల కఠోర శిక్షణను పూర్తి చేసిన శ్రీనివాస్ కల ఉద్యోగ పట్టాను అందుకున్నాడు. అతని పట్టుదలతో కాశ్మీర్‌లో దేశ సేవలకు వెళ్తున్నాడు. ఈ విజయం పట్ల స్వగ్రామంలో ఆనందం నెలకొంది.

News December 5, 2025

సూర్యాపేట: ‘పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణకు పకట్బందీ ఏర్పాట్లు చేయాలి’

image

పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఫెసిలిటేషన్ సెంటర్లలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవి నాయక్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాలకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు, జిల్లాల కలెక్టర్లు, పంచాయితీరాజ్, పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News December 5, 2025

గన్నవరం చేరుకున్న కన్నడ సూపర్‌ స్టార్

image

కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్‌ కుమార్‌ శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బొండా సిద్ధార్థ, గుమ్మడి నరసయ్య, డైరెక్టర్ పరమేశ్వర్ తదితరులు, అభిమాన సంఘాల నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శివరాజ్‌ కుమార్‌ ఇంద్రకీలాద్రికి చేరుకొని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.