News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 11, 2025
కర్నూలు డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్

కర్నూలు విద్యాశాఖ అధికారిగా గురువారం ఎల్.సుధాకర్ బాధితులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ A.సిరిని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈవో మాట్లాడుతూ.. రానున్న పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలసికట్టుగా కృషి చేస్తామన్నారు. జిల్లాలో విద్యార్థుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
News December 11, 2025
ప్రజా సేవల్లో సంతృప్తి పెంచేందుకు చర్యలు: కర్నూలు కలెక్టర్

పెన్షన్, రేషన్, ఆసుపత్రి సేవలు, అన్నా క్యాంటీన్లు తదితర ప్రభుత్వ సేవల్లో ప్రజల సంతృప్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, సీఎస్ విజయానంద్‌కు వివరించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ అధికారులను ఉద్దేశించి అవినీతి లేకుండా, లబ్ధిదారులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సూచించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News December 11, 2025
ఎస్‌ఐఆర్ పూర్తికి సహకరించండి: కర్నూలు ఆర్వో విశ్వనాథ్

కర్నూలు అసెంబ్లీలో ఎస్‌ఐఆర్‌ను బూత్ స్థాయిలో ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆర్వో పి.విశ్వనాథ్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ వివరాలు, చిరునామా, ప్రోజనీ సమాచారాన్ని తప్పనిసరిగా బూత్ యాప్‌లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కర్నూలులో 2,74,803 ఓటర్లలో ఇప్పటివరకు 37,561 మ్యాపింగ్, 15,821 ప్రోజనీ పూర్తి అయ్యాయన్నారు.


