News September 13, 2025
100 రోజుల్లో మేడారం మాస్టర్ ప్లాన్ పూర్తి: మంత్రులు

మేడారం మాస్టర్ ప్లాన్ పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు. కోయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆధునికరించాలని మంత్రులు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి సూచించిన మార్పులను వివరించారు.
Similar News
News September 13, 2025
నేపాల్ పార్లమెంట్ రద్దు.. ఎన్నికల తేదీ ప్రకటన

నేపాల్‌లో వచ్చే ఏడాది మార్చి 5న ఎలక్షన్స్ జరగనున్నట్లు ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. నిన్న తాత్కాలిక ప్రధాన మంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆమె నేతృత్వంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు రద్దుకు ఆమోదం తెలిపారు.
News September 13, 2025
అంగన్‌వాడీల్లో హెల్పర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలోని 4,687 మినీ అంగన్‌వాడీలను ప్రభుత్వం మెయిన్ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఆయా కేంద్రాల్లో సహాయకుల నియామకానికి ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరితగతిన నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సహాయకుల నియామకంతో లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది.
News September 13, 2025
వందకు పైగా రాఫెల్ జెట్ల కొనుగోలుకు IAF ప్రతిపాదన

మేడ్ ఇన్ ఇండియా కింద 114 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) డిఫెన్స్ మినిస్ట్రీకి ప్రతిపాదన సమర్పించింది. ఇది రక్షణ రంగంలో అతిపెద్ద డీల్(విలువ ₹2L Cr) అని తెలుస్తోంది. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్, ఇండియన్ కంపెనీలు వీటిని తయారు చేయనున్నాయి. వీటిలో 60% స్వదేశీ కంటెంట్ వాడనున్నారు. అటు డసాల్ట్ సంస్థ HYDలో మెయింటెనెన్స్ ఫెసిలిటీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.