News October 11, 2025
చైనా దిగుమతులపై 100% అదనపు టారిఫ్స్: ట్రంప్

చైనా దిగుమతులపై 100% అదనపు టారిఫ్స్ విధిస్తున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పుడున్న టారిఫ్‌లపై అదనంగా 100% విధించారు. అలాగే అన్ని కీలక సాఫ్ట్‌వేర్‌ల ఎగుమతులపైనా ఆంక్షలు విధిస్తామన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో, దానికి ప్రతీకారంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా అసాధారణ దూకుడును ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.
Similar News
News October 11, 2025
విండీస్‌కు జై’సవాల్’.. 300 కొడతాడా?

WIతో రెండో టెస్టులో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి రోజే <<17968685>>318/2<<>> చేసింది. ఇంకా 8 వికెట్లు ఉండటంతో రికార్డు బ్రేకింగ్ స్కోర్ ఖాయమని తెలుస్తోంది. జైస్వాల్ (253 బంతుల్లో 173*) ఇప్పటికే 200 మార్కుకు చేరువలో ఉన్నారు. ఆయన ఇలాగే ఆడితే 300, 400 కూడా కొట్టే అవకాశం లేకపోలేదు. కాగా 23 ఏళ్ల వయసులో అత్యధిక 150+ స్కోర్లు బాదిన ఆటగాళ్లలో డాన్ బ్రాడ్‌మన్ (8) తర్వాత జైస్వాల్ (5) రెండో స్థానంలో ఉన్నారు.
News October 11, 2025
మీ లైఫ్‌లో టాక్సిక్ ఫ్రెండ్స్ ఉన్నారా?

ఈరోజుల్లో ముందు పొగిడి, వెనక తిట్టుకునే వాళ్లే ఎక్కువ. అయితే వీరిలో మన స్నేహితులు కూడా ఉంటారు. స్నేహం ముసుగులో మనం ఏం చేసినా ప్రతీదాన్నీ వ్యతిరేకంగా చూస్తూనే, పైకి ప్రేమగా నటిస్తారు. మనసులో ద్వేషాన్ని నింపుకుంటారు. వీరినే టాక్సిక్ ఫ్రెండ్స్ అంటారు. ఇలాంటివారి గురించి తెలిస్తే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలంటున్నారు నిపుణులు. వీరికి ఇంపార్టెన్స్ ఇస్తూనే కాస్త ప్రైవసీ పాటించాలని సూచిస్తున్నారు.
News October 11, 2025
భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

హీరోయిన్ దీపికా పదుకొణె భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. నిన్న వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. హెల్త్ మినిస్టర్ నడ్డాతో భేటీ అయిన ఫొటోలను దీపిక SMలో పోస్ట్ చేశారు. ఈ బాధ్యతలు తీసుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, టెలీ మానస్ వంటి స్కీమ్‌లను ప్రమోట్ చేయడంలో ఆమె కేంద్రంతో కలిసి పనిచేస్తారు.