News October 3, 2024
100 మంది శిశువులకు ‘నస్రల్లా’ పేరు!

ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాక్‌లో పుట్టిన 100 మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టుకున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే ఆయనకు ఘన నివాళి అని పేర్కొంది. ఇరాక్‌లో ఎక్కువగా ఉండే షియా కమ్యూనిటీ ప్రజల్లో నస్రల్లాకు ఉన్న ఆదరణే ఇందుకు కారణం. మరోవైపు నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తూ ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది.
Similar News
News January 22, 2026
గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు వాయిదా

TG: <<17820908>>గ్రూప్-1<<>> అభ్యర్థుల భవితవ్యంపై తీర్పును ఫిబ్రవరి 5కు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా తుదితీర్పునకు లోబడి నియామకాలు ఉండాలని పేర్కొంది. ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉండగా కాపీ రెడీ కాకపోవడంతో FEB 5న ఇవ్వనున్నట్లు పేర్కొంది.
News January 22, 2026
ఎస్.జానకి కుమారుడు కన్నుమూత

లెజెండరీ సింగర్ ఎస్.జానకి కుమారుడు మురళీ కృష్ణ(65) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర వెల్లడించారు. మురళీ మరణ వార్త షాక్‌కు గురి చేసిందని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు సినిమాల్లోనూ నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
News January 22, 2026
మార్కెట్ విలువ పెంపు.. రియల్ బూమ్, ఆదాయమే టార్గెట్!

AP: రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడం, ఆదాయం పెంచుకోవడమే టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల <<18911969>>మార్కెట్ విలువ<<>> పెంచాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరి 1వ తేదీన పెంచిన విలువతో దాదాపు 9 నెలల్లోనే రూ.7వేల కోట్లు ఆర్జించింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. 7-8 శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మార్కెట్ విలువ పెంచే అవకాశం ఉంది.


