News November 21, 2024
2 జిల్లాల్లో 100% పూర్తయిన ఇంటింటి సర్వే
TG: సమగ్ర ఇంటింటి సర్వే జనగాం, ములుగు జిల్లాల్లో వందశాతం పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. నల్గొండ, కామారెడ్డి, మంచిర్యాల, భువనగిరి, జగిత్యాల, NZB, సిరిసిల్ల, గద్వాల, MBNR, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. GHMCలో 60.60% లక్ష్యాన్ని అందుకున్నట్లు సర్కార్ వివరించింది.
Similar News
News November 22, 2024
JEE MAIN: నేడే లాస్ట్ డేట్
జేఈఈ మెయిన్-2025 జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇవాళ రా.9 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, రా.11.50 వరకు ఫీజు చెల్లించవచ్చని NTA తెలిపింది. ఈనెల 26, 27 తేదీల్లో దరఖాస్తు సవరణకు అవకాశం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31వ తేదీ మధ్య ఈ పరీక్ష జరగనుంది. ఏప్రిల్లో సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుంది.
వెబ్సైట్: jeemain.nta.nic.in
News November 22, 2024
మా డాడీ ఫస్ట్ బైక్ ఇదే: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన తండ్రి సలీమ్ ఖాన్ కొనుగోలు చేసిన తొలి బైక్ ఏంటో సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్రయంఫ్ టైగర్ 100 బైకును 1956లో కొన్నట్లు తెలిపారు. తన తండ్రి, ఆ బైకుతో తీసుకున్న ఫొటోలను Xలో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఆయన ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
News November 22, 2024
సురేఖపై నాగార్జున దావా.. ఈనెల 28న తీర్పు
TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సురేఖ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్పై గురువారం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగార్జున తరఫు లాయర్ డిమాండ్ చేశారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి, ఈనెల 28న తీర్పును వెల్లడించనున్నట్లు తెలిపారు.