News September 17, 2024
ప్రభుత్వానికి 100 రోజులు.. రేపు NDA శాసనసభా పక్ష భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరగనుంది. ఈ భేటీకి dy.cm పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేస్తున్నారు.
Similar News
News December 21, 2024
పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు: అంబటి
AP: పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు. ప్రభుత్వం సంగతి 6 నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. కొందరు పార్టీలు పెట్టి మరో దాంట్లో కలిపేశారు. ఇంకొకరు పార్టీ పెట్టి మరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ అలా కాదు. కష్టమైనా, నష్టమైనా, అన్యాయంగా జైల్లో పెట్టినా ప్రజల కోసం అన్నింటినీ ఎదుర్కొన్నారు’ అని చెప్పారు.
News December 21, 2024
పాతబస్తీలో చ.గజానికి రూ.81వేలు ఇస్తున్నాం: ఎన్వీఎస్ రెడ్డి
TG: పాతబస్తీలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. విస్తరణపై ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రచిస్తోందని, త్వరలోనే సీఎం పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. పాతబస్తీలో మెట్రో మార్గం కోసం 1100 ఆస్తులను సేకరిస్తున్నామని, చదరపు గజానికి రూ.81వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిర్వాసితులకు చెక్కులు ఇచ్చి, నిర్మాణాలను తొలగిస్తామని వెల్లడించారు.
News December 21, 2024
పెళ్లి చేసుకున్న బిగ్బాస్ నటి
ఇటీవల ముగిసిన బిగ్బాస్ సీజన్-8తో పాపులర్ అయిన నటి సోనియా ఆకుల వివాహం చేసుకున్నారు. తన ప్రియుడి యశ్తో ఇవాళ తెల్లవారుజామున ఆమె పెళ్లి జరిగింది. ఈ వేడుకకు బిగ్బాస్ కంటెస్టెంట్లతో పాటు ఇతర నటులు హాజరయ్యారు. తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా ఆర్జీవీ తెరకెక్కించిన రెండు చిత్రాల్లో నటించారు. దీంతో ఆమెకు బిగ్బాస్ ఆఫర్ వచ్చింది.