News July 6, 2024

100 అడుగుల ధోనీ కటౌట్

image

అభిమాన ప్లేయర్ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫ్యాన్స్ వెనకడుగు వేయట్లేదు. రేపు మాజీ క్రికెటర్ ధోనీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏపీలోని నందిగామలో ఫ్యాన్స్ 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని ఐదేళ్లు గడుస్తున్నా ఆయనపై అభిమానం ఏ మాత్రం తగ్గలేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News November 6, 2025

శుభ సమయం (06-11-2025) గురువారం

image

✒ తిథి: బహుళ పాడ్యమి సా.4.51 వరకు
✒ నక్షత్రం: భరణి ఉ.8.35 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.1.30-3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48, మ.2.48-3.36
✒ వర్జ్యం: రా.7.49-9.19
✒ అమృత ఘడియలు: ఉ.5.20 నుంచి మొదలు

News November 6, 2025

TODAY HEADLINES

image

➭ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
➭ KTR.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: CM రేవంత్
➭ 3 ఫీట్ల రేవంత్ 30 ఫీట్లున్నట్టు బిల్డప్ ఇస్తాడు: KTR
➭ APలోని 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
➭ కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: మంత్రి అనగాని
➭ ఆకాశంలో కనువిందు చేసిన సూపర్ మూన్
➭ PM మోదీతో ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ భేటీ
➭ SA టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ

News November 6, 2025

ప్రభుత్వ వర్సిటీల్లో యూనిఫైడ్ యాక్ట్: లోకేశ్

image

AP: ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత, ఇంటర్ విద్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని ఆదేశించాను. ITIలు, వర్సిటీలను NOVలోగా పరిశ్రమలతో అనుసంధానించాలి. విద్యార్థుల 100% క్యాంపస్ సెలక్షన్స్‌కు చర్యలు తీసుకోవాలి. ఇంటర్‌లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు చేపట్టాలి’ అని తెలిపారు.