News April 23, 2025
1,680 స్కూళ్లలో 100% పాస్, 19 స్కూళ్లలో మొత్తం ఫెయిల్

AP: టెన్త్ ఫలితాల్లో 1,680 స్కూళ్లలో 100% పాస్ రేట్ ఉండగా, 19 స్కూళ్ల(ఇందులో 9 ప్రైవేట్)లోని విద్యార్థులంతా ఫెయిలయ్యారు. ఓవరాల్‌గా 65.36% మంది ఫస్ట్, 10.69% మంది సెకండ్, 5.09% మంది థర్డ్ డివిజిన్‌లో పాసయ్యారు. ఫలితాల్లో బాలికలు హవా కొనసాగించారు. 3,01,202 మంది గర్ల్స్ పరీక్షలు రాయగా 2,53,278 మంది(84.09%) పాసయ్యారు. 3,13,257 మంది బాలురు ఎగ్జామ్స్ రాయగా 2,45,307 మంది(78.31%) ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News August 14, 2025
రజినీకాంత్ ‘కూలీ’ రివ్యూ&రేటింగ్

మిత్రుడి(సత్యరాజ్)ని ఎవరు, ఎందుకు చంపారో హీరో(రజినీకాంత్) తెలుసుకునే క్రమంలో జరిగే సంఘటనలే ‘కూలీ’ స్టోరీ. ఎప్పటిలాగే రజినీ ఎలివేషన్స్ అభిమానులకు నచ్చుతాయి. యాక్షన్ సీన్లు, కొన్నిచోట్ల ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కథ పెద్దది కావడంతో సెకండాఫ్ సాగదీతలా అనిపిస్తుంది. నాగార్జున పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ అక్కడక్కడ డౌన్ కావడం మైనస్.
రేటింగ్-2.5/5
News August 14, 2025
ఈసారి జగన్‌నూ ఓడిస్తాం: మంత్రి సవిత

AP: పులివెందుల ZPTC స్థానంలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ‘పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఈ విజయానికి కష్టపడిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో జగన్‌నూ ఓడించి పులివెందుల కోటను బద్దలు కొడతాం’ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
News August 14, 2025
NTR, హృతిక్ ‘వార్-2’ రివ్యూ & రేటింగ్

శత్రువులుగా మారిన మిత్రులు విక్రమ్(NTR), కబీర్(హృతిక్) దేశం కోసం ఒక్కటై విదేశీ కుట్రను ఎలా తిప్పికొట్టారనేదే ‘వార్-2’ స్టోరీ. NTR, హృతిక్ స్క్రీన్ ప్రజెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, యాక్షన్, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. వార్-1 ఇంట్రో లేకపోవడం, ఊహించే సీన్లు, కొన్నిచోట్ల డబ్బింగ్ సమస్య, పూర్ VFX మైనస్. స్పై యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికే నచ్చుతుంది.
Way2News రేటింగ్-2.5/5