News September 5, 2024
ఖరీఫ్‌లో 100 శాతం వరి సాగు పూర్తి: వ్యవసాయ శాఖ

TG: ఖరీఫ్ సీజన్లో అన్ని రకాల పంటల సాధారణ విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 1.20 కోట్ల ఎకరాల్లో పూర్తయినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వరి సాగు లక్ష్యం 57.18 లక్షల ఎకరాలు కాగా 100% నాట్లు పడినట్లు తెలిపింది. పత్తి 50.48L ఎకరాలు, పప్పు ధాన్యాలు 5.66L ఎకరాలు, మొక్కజొన్న 5.11L ఎకరాలు, సోయాబీన్ 3.97L ఎకరాల్లో సాగైనట్లు పేర్కొంది.
Similar News
News November 7, 2025
ఫోన్ అడిక్షన్: 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారట!

ఇటీవల ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ WeWard ఓ ఫొటో షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖంపై డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయని హెచ్చరించింది. పలు ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ‘Sam’ అనే మోడల్‌ను రూపొందించింది.
News November 7, 2025
టెక్నికల్ సమస్య వల్లే అంతరాయం: రామ్మోహన్

ATCలో సాంకేతిక లోపం వల్లే ఢిల్లీ, ముంబైలో విమానాల రాకపోకలకు <<18227103>>అంతరాయం<<>> ఏర్పడిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ టెక్నికల్ సమస్య వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అయినా లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. విమానాలు సకాలంలో నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.
News November 7, 2025
ఈ వ్యాధులు ఉంటే అమెరికా వీసా కష్టమే!

వీసా నిబంధనలను కఠినం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గుండె సంబంధ సమస్యలు, రెస్పిరేటరీ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వీసా నిరాకరించాలని మార్గదర్శకాలు రూపొందించినట్టు వార్తలు వస్తున్నాయి. వారిని అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని వీసా మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.


