News March 28, 2024
MLC ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 100 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏఆర్వో వెంకట మాధవరావు తెలిపారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు. మొత్తం 1439 మంది ఓటర్లుండగా అందరూ ఓటేశారు. కాగా కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.
Similar News
News January 30, 2026
బ్లాక్ హెడ్స్‌ను తొలగించే ఇంటి చిట్కాలు

బ్లాక్ హెడ్స్‌ను తొలగించడానికి ముందుగా ముఖానికి ఆవిరి పట్టాలి. తర్వాత వెట్ టవల్‌తో సున్నితంగా రుద్దాలి. * పెరుగు, శనగపిండి, కాఫీ పొడి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ మీద రాసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. * గుడ్డులోని తెల్లసొనలో బేకింగ్ సోడా కలిసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకొని కడిగేసుకోవాలి.
News January 30, 2026
ఎక్కువ పూజలు చేస్తే ఎక్కువ కష్టాలొస్తాయా?

ఇది నిజం కాదని పండితులు చెబుతున్నారు. కష్టసుఖాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయని, ఇవి పూర్వ కర్మల ఫలితంగా వస్తుంటాయని అంటున్నరు. పూజలు చేస్తే ఆ కష్టాలను తట్టుకునే మనోబలం, సానుకూల శక్తి లభిస్తాయంటున్నారు. అంతే తప్ప కొత్తగా కష్టాలు రావని సూచిస్తున్నారు. అయితే ఆడంబరంగా చేసే పూజల కన్నా భక్తి ప్రాధాన్యంతో చేసే పూజలకే అధిక ఫలం ఉంటుంది. నిష్కల్మషంగా ప్రార్థిస్తే భగవంతుడు మన కోర్కెలు నెరవేరుస్తాడు.
News January 30, 2026
మున్సిపల్ ఎన్నికల బరిలో అమరవీరుడు సంతోష్ బాబు తల్లి

TG: గల్వాన్ లోయ ధీరుడు కల్నల్ సంతోష్ తల్లి మంజుల మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. సూర్యాపేటలో BRS తరఫున నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 2020లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు వీరమరణం పొందారు. 2021లో కేంద్రం ఆయనను మహావీర్ చక్రతో గౌరవించింది.


