News November 27, 2024
16 జిల్లాల్లో 100 శాతం సర్వే పూర్తి

TG: కుల గణన సర్వే పూర్తి కావొస్తుంది. నిన్నటి వరకు 16 జిల్లాల్లో 100శాతం సర్వే పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మరో 13 జిల్లాల్లో 99 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కలిపి 93.5 శాతం సర్వే పూర్తయిందని వెల్లడించారు. మరోవైపు డేటాను ఎప్పటికప్పుడూ సిబ్బందితో కంప్యూటీకరణ చేయిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 23, 2025
మేడ్చల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్

TG: గోరక్షాదళ్ సభ్యుడు సోనూసింగ్పై <<18077269>>దాడిని<<>> కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఎంఐఎం రౌడీలకు కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని ధ్వజమెత్తారు. గోభక్తులపై దాడులకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు దాడిని వ్యతిరేకిస్తూ ఇవాళ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు తెలిపారు.
News October 23, 2025
అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్సింగ్ షెకావత్ జననం
1979: సినీ హీరో ప్రభాస్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం
News October 23, 2025
ఆస్ట్రేలియన్ ప్లేయర్ రికార్డు సెంచరీ

ఆస్ట్రేలియన్ ప్లేయర్ గార్డ్నర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. WWCలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో 69 బంతుల్లోనే 15 ఫోర్లతో శతకం బాదారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఛేదనలో గార్డ్నర్(104*), అన్నాబెల్(98*) విజృంభించడంతో ఆస్ట్రేలియా 40.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.