News June 6, 2024

అంతరిక్షంలో 1000 రోజులు!

image

వివిధ మిషన్లలో భాగంగా అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రష్యాకు చెందిన ఒలెగ్ కొనొనెంకో (59) నిలిచారు. 2008 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన అనుభవం ఒలెగ్‌కు ఉంది. కాగా ప్రస్తుత మిషన్ 2023 సెప్టెంబరు 15న ప్రారంభం కాగా ఈ ఏడాది SEP 23 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఈ రికార్డ్ చేరుకున్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ వెల్లడించింది.

Similar News

News November 28, 2024

త్వరలో మరికొందరు అరెస్ట్: RRR

image

AP: తన కస్టోడియల్ కేసును సీఐడీ పారదర్శకంగా విచారణ చేస్తోందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. తనపై దాడి చేసిన అధికారులు కొందరు అరెస్ట్ అయ్యారని, త్వరలోనే మరికొందరు అరెస్ట్ అవుతారని చెప్పారు. ‘సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ నాపట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ నాపై దాడి చేయించారు. ఆయన విదేశాలకు పారిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News November 28, 2024

పార్ల‌మెంటుకు కాంగ్రెస్ నుంచి మరో గాంధీ

image

నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఏడుగురు పార్ల‌మెంటుకు వెళ్లారు. 1951-52లో అల‌హాబాద్ నుంచి నెహ్రు *1967లో రాయ్‌బ‌రేలీ నుంచి ఇందిరా గాంధీ *1980లో అమేథీ నుంచి సంజ‌య్ గాంధీ *1981లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ *1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ *2004లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ *2024లో వ‌య‌నాడ్ నుంచి ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ తరఫున మొదటిసారి పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టారు.

News November 28, 2024

కశ్మీర్ మాదికాదు: నోరుజారి ఒప్పుకున్న పాక్ మంత్రి

image

ఇస్లామాబాద్‌ను ముట్టడిస్తున్న POK ప్రజలపై పాక్ హోంమంత్రి మోహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానగా మారాయి. ‘రాజ్యాంగబద్ధంగా మీరు పాక్ పౌరులు కాదు. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటే మిమ్మల్ని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే దేశం నుంచి విడిపోయి భారత్‌తో కలుస్తామన్న POK ప్రజలకిది అస్త్రంగా మారింది. మరోవైపు POK పాక్‌ది కాదని స్వయంగా ఒప్పుకున్నట్టైంది.