News March 20, 2025
కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్: అఖిలేశ్ యాదవ్

ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాలో మిస్సయిన 1,000మంది భక్తుల జాడ కనుక్కోవడంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ విఫలమైందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తప్పిపోయిన వారి పోస్టర్లు ఉన్నాయన్నారు. యూపీ, MP ప్రభుత్వాలు కలిసి వెహికిల్ పార్కింగ్ ఏర్పాట్లు మాత్రమే చేశాయని దుయ్యబట్టారు. కుంభమేళా ఏర్పాట్లకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో తెలపాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.
Similar News
News December 18, 2025
ముర్రా జాతి గేదెల ప్రత్యేకతలు ఇవే

ముర్రా జాతి గేదెలు హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు చెందినవి. వీటి శరీరం ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా V(వీ) ఆకారంలో ఉంటుంది. దీని వల్ల ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పాలను ఇస్తాయి. ఒక ముర్రా గేదె రోజుకు 14 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. మేలైన జాతి గేదెలు రోజుకు 25-30 లీటర్ల వరకు పాలు ఇచ్చే ఛాన్సుంది. ఒక ఈత కాలంలో ఇవి సుమారు 270-300 రోజులు పాలు ఇస్తాయి. పాలలో వెన్న 7 నుంచి 9 శాతంగా ఉంటుంది.
News December 18, 2025
అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. ‘శాంతి’ బిల్లుకు LS ఆమోదం

‘అణు రంగం’లోకి ప్రైవేట్ సంస్థల్ని అనుమతించడానికి కేంద్రం తీసుకువచ్చిన ‘శాంతి(SHANTI)’ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దీనిని దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక ‘మైల్ స్టోన్’ చట్టంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. దీంతో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అయితే ఈ బిల్లు పౌర అణు నష్టపరిహార చట్టం-2010లోని నిబంధనల్ని నీరుగార్చేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
News December 18, 2025
514 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 20 – JAN 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, CA/CFA/CMA-ICWA, MBA/PGDBM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850. SC, ST, PwBDలకు రూ.175. వెబ్సైట్: bankofindia.bank.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


