News April 24, 2025
1000 మంది మావోలు.. చుట్టుముడుతున్న బలగాలు!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో సుమారు 1000మంది మావోలను 20వేలమంది భారత బలగాలు చుట్టుముడుతున్నట్లు సమాచారం. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద యాంటీ-నక్సల్ ఆపరేషన్‌గా కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు మావోయిస్టులకు చావు దెబ్బ తగలొచ్చని పేర్కొన్నాయి. ఇప్పటికే ఎన్‌కౌంటర్లో ఐదుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఖ్య భారీగా పెరగనుందని తెలుస్తోంది.
Similar News
News August 16, 2025
దురాశతో ఉన్నది పోగొట్టుకున్నారు.. KCRపై రేవంత్ సెటైర్

TG: దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో ఉన్నది పోగొట్టుకున్నారని సీఎం రేవంత్ BRS చీఫ్ KCRపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తెలంగాణ పేరు, పేగు బంధం కూడా తెంచుకున్నారని తెలిపారు. ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా తెలంగాణను మారుస్తానని, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యంతో పేదల ఆత్మగౌరవాన్ని పెంచామని ఓ పుస్తకావిష్కరణ సభలో చెప్పారు.
News August 16, 2025
బ్రెవిస్‌కు ఎక్స్‌ట్రా పేమెంట్.. CSK క్లారిటీ

IPL-2025లో ఆడేందుకు <<17405212>>బ్రెవిస్‌కు<<>> ఎక్స్‌ట్రా పేమెంట్ ఇచ్చారన్న మాజీ క్రికెటర్ అశ్విన్ వ్యాఖ్యలపై CSK స్పందించింది. ‘టోర్నీ నియమాలకు లోబడే గాయపడిన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో బ్రెవిస్‌ను తీసుకున్నాం. రూల్ ప్రకారం రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌కు ఇంజూర్డ్ ప్లేయర్‌కు ఇవ్వాల్సిన ఫీ కంటే ఎక్కువ ఇవ్వొద్దు. దాని ప్రకారమే వేలంలో గుర్జప్నీత్‌ను కొన్న ధరనే (₹2.2Cr) బ్రెవిస్‌కు చెల్లించాం’ అని స్పష్టం చేసింది.
News August 16, 2025
యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేలా చర్చలు: ట్రంప్

అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం విజయవంతంగా సాగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా ముగించే దిశగా చర్చలు సాగాయన్నారు. ఇదే విషయమై జెలెన్ స్కీ, ఈయూ నేతలు, నాటో జనరల్ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. ఎల్లుండి జెలెన్‌స్కీ అమెరికాకు వస్తారని, అన్ని సక్రమంగా జరిగితే పుతిన్‌తో మరోసారి సమావేశం అవుతామన్నారు.