News April 7, 2024
విరాట్ కోహ్లీ హెయిర్ కట్కు రూ.1,00,000!
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు, సరికొత్త హెయిర్ స్టైల్తో స్టైలిష్గా కనిపిస్తుంటారు. ఇందుకోసం ఆయన భారీగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. కాగా కోహ్లీ నుంచి హెయిర్ కట్కు కనీసం రూ.లక్ష ఫీజుగా తీసుకుంటున్నట్లు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తెలిపారు. పలువురు సినీ, స్పోర్ట్స్, బిజినెస్ సెలబ్రిటీల దగ్గర నుంచి కూడా దాదాపు ఇదే ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <
News February 5, 2025
మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు
AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
News February 5, 2025
భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.