News May 18, 2024
రూ.1,00,000కు చేరువలో కేజీ వెండి ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పెరిగి రూ.68,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరగడంతో రూ.74,620 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.4,000 పెరిగి రూ.96,500కు చేరింది. త్వరలోనే కేజీ సిల్వర్ రేటు రూ.లక్ష పలికే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.
News November 23, 2025
పిల్లలు బరువు తగ్గుతున్నారా?

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.
News November 23, 2025
టెన్త్, ఐటీఐ అర్హతతో 542 పోస్టులు

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో 542 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల పురుషులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, పీఈటీ/ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.50, SC, STలకు ఫీజు లేదు. దరఖాస్తు హార్డ్ కాపీ, సర్టిఫికెట్ జిరాక్స్లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


