News October 8, 2024
UAE నుంచి భారత్కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్

రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.
Similar News
News January 22, 2026
నవజాత శిశువుల్లో ఈ లక్షణాలున్నాయా?

శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు లేదా కొద్దిగా నీలం రంగులో కనిపించడం వంటివి పసిపిల్లల్లో జలుబు లక్షణాలు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉన్నా, ఏడుస్తున్నప్పుడు వేగంగా శ్వాస తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
News January 22, 2026
ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు

పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రూల్స్ను కఠినం చేసింది. ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సును రద్దు లేదా 3 నెలల పాటు సస్పెండ్ చేయనుంది. గతంలో సీరియస్ ఉల్లంఘనల్లో ఇది ఉండేది. కానీ ఇపుడు హెల్మెట్, సీట్ బెల్ట్, రెడ్ లైట్ జంపింగ్ వంటి అంశాలకూ వర్తించనుంది. JAN 1 నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం చట్టాన్ని సవరించింది.
News January 22, 2026
విజయ్ సినిమా పేరే పార్టీ గుర్తు.. ఓటర్లు ‘విజిల్’ వేస్తారా?

తమిళ హీరో విజయ్ ‘TVK’ పార్టీకి EC ఇవాళ విజిల్ గుర్తును కేటాయించింది. అయితే ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ‘విజిల్’ పేరిటే ఎన్నికల గుర్తు రావడంతో ఫ్యాన్స్తో పాటు కార్యకర్తలు జోష్లో ఉన్నారు. రెండింటికీ లింక్ చేస్తూ ‘విజిల్ పోడు’ అని SMలో పోస్టులు పెడుతున్నారు. మూవీ మాదిరే పార్టీ కూడా ఎన్నికల్లో విజిల్ వేసి గెలుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది సమ్మర్లో TNలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.


