News July 14, 2024
Xలో 100M ఫాలోవర్స్.. మోదీ రికార్డు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల మార్కును చేరుకుంది. ఇండియా నుంచి ఈ ఫీట్ నమోదు చేసిన తొలి రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఓవరాల్‌గా అత్యధిక ఫాలోవర్ల జాబితాలో ఏడో స్థానానికి చేరారు. తొలి ఆరు స్థానాల్లో ఎలాన్ మస్క్(188.7M), ఒబామా(131.7M), రొనాల్డో(112M), జస్టిన్ బీబర్(110.5M), రిహన్నా(108M), కాటీ పెర్రీ(106.3M) ఉన్నారు.
Similar News
News March 31, 2026
కలెక్షన్ల సునామీ.. చరిత్ర సృష్టించిన ధురంధర్-2!

‘ధురంధర్-2’ రూ.1,390CR(గ్రాస్) కలెక్షన్లు రాబట్టింది. ఫస్ట్ పార్ట్ లైఫ్‌టైమ్ వసూళ్ల(రూ.1,350CR)ను 12 రోజుల్లోనే అధిగమించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రాల లిస్టులో 4వ స్థానానికి చేరింది. తొలి 3 స్థానాల్లో దంగల్, బాహుబలి-2, పుష్ప-2 ఉన్నాయి. ఇక కర్ణాటకలో రూ.100+CR సాధించిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది.
-ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.
News March 31, 2026
వందే భారత్‌లో ఫుడ్.. అలెర్జీకి గురైన యువతి ఫొటో వైరల్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో <<19481891>>ఫుడ్<<>> తిన్న తర్వాత అలెర్జీకి గురైనట్లు ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. పెదవులు ఉబ్బిపోయిన ఫొటో, మెడికల్ బిల్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరలవుతున్నాయి. ‘వందే భారత్‌లో ఇచ్చే ఆహారం అత్యంత నాసిరకం. ఫిర్యాదు చేస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు’ అని ఆమె వాపోయారు. తన బిడ్డతో కలిసి దేవ్‌గఢ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్లు బాధితురాలు పేర్కొన్నారు.
News March 31, 2026
పరారీలో ఖైదీ.. గ్యాస్ బుక్ చేసి దొరికిపోయాడు!

కర్ణాటకలో భార్యను హత్య చేసి, నాలుగేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సందీప్ తోమర్ అనే మాజీ జవాన్ చివరకు గ్యాస్ బుకింగ్ వల్ల దొరికిపోయాడు. 2014లో జీవిత ఖైదు పడిన ఇతను.. బెయిల్‌పై వచ్చి 2022 నుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడి పాన్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయడంతో పోలీసులు అతడిని ట్రాక్ చేశారు. MPలోని పాండుర్నాలో మాటువేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.


