News November 30, 2024
పదేళ్లలో 102% పెరిగిన మెడికల్ కాలేజీలు: నడ్డా

దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి WHO ప్రమాణం కన్నా మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. WHO ప్రకారం 1:1000గా ఉండగా దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని తెలిపారు. ఈ నెల వరకు మొత్తం 13,86,145 మంది వైద్యులు రాష్ట్ర, జాతీయ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. 2014లో 387 ప్రభుత్వం కాలేజీలు ఉంటే ఇప్పుడు 102% పెరిగి ఆ సంఖ్య 780గా ఉందన్నారు.
Similar News
News March 30, 2026
రేపు మాంసం దుకాణాలు బంద్

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల రేపు మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా నాన్ వెజ్ షాపులు మూసేస్తున్నారు. GHMC పరిధిలోని కబేళాలు, మటన్ దుకాణాలు మంగళవారం మూసేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.
News March 30, 2026
ఆ టైమ్లో చనిపోవాలనుకున్నా: నటి హేమ

డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు మానసికంగా కలచివేశాయని నటి హేమ చెప్పారు. ‘ఆ సమయంలో చనిపోవాలనిపించింది. మానసికంగా కుంగిపోయా. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే చివరికి నిర్దోషిగా బయటికి వచ్చా. మీడియాలో వచ్చిన కొన్ని వార్తల వల్ల నా కుటుంబం చాలా సఫర్ అయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆమె పాల్గొన్నారు.
News March 30, 2026
ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ.. ఎంతంటే?

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి 95 క్రాస్ అయింది. ప్రస్తుతం ఒక $ విలువ ₹95.12గా ఉంది. సెన్సెక్స్ 1750 పాయింట్ల నష్టంతో 71,832 వద్ద, నిఫ్టీ 515 పాయింట్లు నష్టపోయి 22,304 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ షేర్లు కుప్పకూలాయి.


