News September 5, 2024
ఉత్తమ ఉపాధ్యాయులుగా 103 మంది ఎంపిక

TG: గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 103 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో పాఠశాల విద్యాశాఖ నుంచి 47 మంది, ఇంటర్ నుంచి 11, విశ్వవిద్యాలయాల నుంచి 45 మంది ఉన్నారు. ఎంపికైన వారిని నేడు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పురస్కారాలతో పాటు రూ.10వేల నగదు, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు.
Similar News
News January 17, 2026
తక్కువ అర్హత పోస్టులకు వారిని మినహాయించొచ్చు: SC

ఎక్కువ అర్హతల వారిని తక్కువ అర్హత పోస్టుల నుంచి మినహాయించొచ్చని SC కీలక తీర్పిచ్చింది. బిహార్ GOVT ఫార్మసిస్ట్ రిక్రూట్మెంటులో డిప్లొమా ఫార్మసీని అర్హతగా నిర్ణయించింది. దీనిపై B.ఫార్మా, M.ఫార్మా అభ్యర్థులు HCకి వెళ్లారు. డిప్లొమా వారితో పోలిస్తే వీరికి ప్రాక్టికల్స్ తక్కువన్న GOVT వాదనతో HC ఏకీభవించి పిిటిషన్ను కొట్టేసింది. అర్హతలపై తుదినిర్ణయం GOVTదేనంది. SC దీన్నే సమర్థించి తాజా తీర్పిచ్చింది.
News January 17, 2026
నోబెల్ బహుమతి కోసం ఇంత పిచ్చా: కైలాశ్ సత్యార్థి

US అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు <<18868941>>మరియా మచాడో<<>> నుంచి నోబెల్ ప్రైజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇది తనను షాక్కు గురి చేసిందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చెప్పారు. ‘పీస్ ప్రైజ్ కోసం ఇంత పిచ్చిగా ఉన్న వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. అవార్డును బదిలీ చేయలేమని <<18821416>>నోబెల్ కమిటీ<<>> చెప్పినట్లు వార్తలొచ్చాయి’ అని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో అన్నారు. 2014లో సత్యార్థి నోబెల్ అందుకున్నారు.
News January 17, 2026
అమరావతి రైతులకు ఒకేచోట ప్లాట్లు!

AP: అమరావతి రైతులకు వేర్వేరు చోట్ల ప్లాట్లు ఇవ్వడంతో వాటిని అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి సమస్యగా మారింది. చాలా ఖర్చుతో కూడుకుని వారికి అప్పగించడం ఆలస్యమైంది. దీంతో 2వ విడత 20,494 ఎకరాలు సేకరిస్తున్న ప్రాంతంలో రైతులకు ఒకే చోట ప్లాట్లు కేటాయించాలని భావిస్తోంది. ఇలా ఇవ్వడం వల్ల CRDAకి అందే స్థలమూ ఒకే ప్రాంతంలో ఉండి సంస్థలకు కేటాయింపులో మధ్యలో అడ్డంకులు ఉండవని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.


