News February 11, 2025
1,036 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

రైల్వే మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ దరఖాస్తు గడువును పొడిగించింది. వివిధ విభాగాల్లో మొత్తం 1,036 పోస్టులకు ఈ నెల 16 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్ సైట్: www.rrbapply.gov.in
Similar News
News December 30, 2025
అలా సందుల్లో దూరడం విజ్ఞత అనిపించుకోదు.. సజ్జనార్ స్వీట్ వార్నింగ్

TG: న్యూ ఇయర్ వేడుకల వేళ యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయనే భయంతో సందుల్లో దూరి, ప్రమాదకరంగా వాహనాలు నడపడం విజ్ఞత అనిపించుకోదని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమేనని, ఒకవేళ యముడు వదిలేసినా చట్టం వదలదన్నారు. ‘మీ ప్రాణం విలువ మాకు తెలుసు. కాబట్టే ఈ హెచ్చరిక’ అని ట్వీట్ చేశారు.
News December 30, 2025
సమయం పెంపు.. రెండు రోజులు కిక్కే కిక్కు

AP: న్యూఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది. బార్లు, ఇన్-హౌస్, ఈవెంట్లకు పర్మిట్ లైసెన్సులు ఉన్న వారికి రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా రాకుండా అధికారిక పనివేళలు పెంచినట్లు తెలిపింది.
News December 30, 2025
జర్మన్ పౌరుడికి ఎలా పెన్షన్ ఇస్తాం: ఆది శ్రీనివాస్

TG: వేములవాడ మాజీ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ పెన్షన్ పొందడంపై MLA ఆది శ్రీనివాస్ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. రమేష్ జర్మన్ పౌరుడు అని కేంద్ర హోంశాఖ ధ్రువీకరించగా, తప్పుడు పత్రాలతో గెలిచినందుకు హైకోర్టు ఆయనకు రూ.30 లక్షల ఫైన్ విధించిందని ఫిర్యాదులో తెలిపారు. అయినా మాజీ ఎమ్మెల్యేగా ప్రతి నెలా రూ.50వేలు పెన్షన్ అకౌంట్లో జమ అవుతోందన్నారు. అయితే ఈ అంశంపై సెక్రటరీకి నిర్ణయాధికారం లేదు.


