News August 29, 2025

రాష్ట్రంలో 1039 కి.మీ. మేర రోడ్లు ధ్వంసం

image

TG: భారీ వర్షాలకు 37 R&B డివిజన్లలో 1039 కి.మీ.మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ‘794 సమస్యాత్మక రోడ్లు గుర్తించాం. 356 చోట్ల కాజ్ వేలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. 37 చోట్ల రోడ్లు తెగిపోగా.. 10చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశాం. 305 ప్రాంతాల్లో రాకపోకలకు నిలిచిపోగా, 236 చోట్ల క్లియర్ చేశాం. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.53.76 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.1157.46 కోట్లు అవసరం’ అని తెలిపారు.

Similar News

News August 29, 2025

‘మహావతార్ నరసింహ’కు భారీగా కలెక్షన్స్

image

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ విడుదలై నెల రోజులు దాటినా ప్రేక్షకుల నుంచి ఇంకా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ ఫ్రాంచైజీలో మహావిష్ణువు అవతారాలపై మరిన్ని సినిమాలు రానున్నాయి.

News August 29, 2025

ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌తోనే ఇండియాపై 50% టారిఫ్స్: Jefferies

image

ట్రంప్ తన వ్యక్తిగత ఫ్రస్ట్రేషన్‌తోనే ఇండియాపై 50% టారిఫ్స్ విధించారని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘Jefferies’ అభిప్రాయపడింది. సుంకాలకు వాణిజ్యం ముఖ్య కారణం కాదని పేర్కొంది. భారత్-పాకిస్థాన్ యుద్ధంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి ఇండియా ఒప్పుకోకపోవడం ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌కు ప్రధాన కారణమని వెల్లడించింది. అలాగే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ మార్కెట్‌లోకి అంగీకరించకపోవడమూ ఓ కారణమని తెలిపింది.

News August 29, 2025

బ్రాంకో టెస్ట్‌కు రోహిత్ సిద్ధం.. ఎప్పుడంటే?

image

యోయో, బ్రాంకో టెస్టుల్లో పాసయ్యేందుకు టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. తన ట్రైనర్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో జిమ్ సెషన్స్‌లో చెమటోడ్చుతున్నారు. ఎలాగైనా ఈ టెస్టులు నెగ్గాలనే కృతనిశ్చయంతో హిట్‌మ్యాన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 13వ తేదీన రోహిత్‌కు బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్ యోయో, బ్రాంకో టెస్టు నిర్వహిస్తుందని సమాచారం.