News February 17, 2025

104ఏళ్ల బండయ్య మాస్టారుకు సన్మానం

image

కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలానికి చెందిన 104ఏళ్ల బండయ్య మాస్టారుకు స్థానిక పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన బండయ్య 104ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు. అనంతరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో సర్టిఫికేట్ ప్రదానం చేశారు.

Similar News

News December 21, 2025

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

image

పల్స్ పోలియోలో భాగంగా వజ్రకరూరు మండల కేంద్రంలోని PHCని ఆదివారం DMHO డాక్టర్ భ్రమరాంబ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పలు రికార్డులు, వార్డులను తనిఖీ చేశారు. అనంతరం పల్స్ పోలియో కేంద్రాలలో పల్స్ పోలియో చుక్కలు ఎంతమంది పిల్లలకు వేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు త్యాగరాజు, గంగాధర్, మండల వైద్యాధికారులు డాక్టర్ తేజస్వి, సర్దార్ వలి ఉన్నారు.

News December 21, 2025

2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు: DMHO

image

అనంతపురం జిల్లాలో 0-5 ఏళ్ల మధ్యగల 2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO దేవి తెలిపారు. జిల్లాలోని 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 1,785 పోలింగ్ బూత్‌లలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించామన్నారు.