News February 17, 2025
104ఏళ్ల బండయ్య మాస్టారుకు సన్మానం

కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలానికి చెందిన 104ఏళ్ల బండయ్య మాస్టారుకు స్థానిక పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన బండయ్య 104ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు. అనంతరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో సర్టిఫికేట్ ప్రదానం చేశారు.
Similar News
News July 6, 2025
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
News July 5, 2025
గూగూడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

నార్పల మండలం గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం డీఎస్పీ వెంకటేశ్ శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, అగ్నిగుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు, అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కేటాయించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచామని చెప్పారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు.
News May 8, 2025
ATP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ సూచించారు. AP విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో వర్షాలు, పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. AP విపత్తుల సంస్థ SMSలు, RTGS నుంచి సూచనలను తెలుపుతున్నామన్నారు. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.