News March 24, 2024
అసదుద్దీన్ వాడే కారుపై రూ.10,485 చలాన్లు
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వినియోగిస్తున్న కారుపై భారీగా పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఆయన వాడుతున్న TS11EV9922 డిఫెండర్ వాహనంపై 2021 నుంచి ఇప్పటివరకు రూ.10,485 చలాన్లు పడ్డాయి. అప్పటినుంచి ట్రాఫిక్ పోలీసులు రెండుసార్లు పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ అవకాశం కల్పించినా ఇవి చెల్లించలేదు. ఇందులో చాలా చలాన్లు ORRపై ఓవర్ స్పీడుతో వెళ్లడంతోనే పడ్డట్లు సమాచారం.
Similar News
News November 4, 2024
పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలి: మంత్రి
TG: గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పనిలో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News November 4, 2024
రేపు సరస్వతి పవర్ భూములను పరిశీలించనున్న పవన్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పల్నాడులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములు పరిశీలించనున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. సరస్వతి శక్తికి సంబంధించిన భూ ఉల్లంఘనలను తనిఖీ చేస్తానని పవన్ కళ్యాణ్ సైతం వెల్లడించారు. కాగా సరస్వతి భూముల విషయంలో వైసీపీ అధినేత జగన్, షర్మిల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
News November 4, 2024
స్టిక్కర్ స్కాం.. అమెజాన్‌కు ₹1.29 కోట్లు టోకరా పెట్టిన యువకులు
రాజస్థాన్‌కు చెందిన రాజ్‌కుమార్, సుభాశ్ అమెజాన్‌కు ₹1.29Cr టోకరా పెట్టి మంగళూరులో దొరికిపోయారు. వీరు అమెజాన్‌లో తక్కువ ధర, లక్షలు విలువైన ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ పెట్టేవారు. ఆర్డర్ వచ్చాక డెలివరీ బాయ్ కళ్లుగప్పి లక్షల విలువైన వస్తువుల స్టిక్కర్లను తక్కువ విలువైన వాటి స్టిక్కర్లతో మార్చేవారు. తీరా హైవాల్యూ ఐటం క్యాన్సిల్ చేసేవారు. తద్వారా లక్షల విలువైన వస్తువులను తక్కువ ధరకే కొట్టేసేవారు.