News April 9, 2024
BRS మీటింగ్లో పాల్గొన్న 106 మంది ఉద్యోగుల సస్పెండ్

TG: ఎన్నికల కోడ్ ఉల్లంఘించి BRS మీటింగ్లో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్సన్ వేటు పడింది. వీరిలో 38 మంది సెర్ప్, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నెల 7న సిద్దిపేటలో ఉద్యోగులతో స్థానిక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ విషయం ఇటీవల బహిర్గతం కావడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
Similar News
News November 28, 2025
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.
News November 28, 2025
త్వరలో.. ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు!

ఆధార్కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ను ఇంటి నుంచే మార్చుకోవచ్చని UIDAI ప్రకటించింది. ‘Aadhaar’ యాప్ ద్వారా OTPతో పాటు ఫేస్ అథెంటికేషన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సేవ త్వరలో అందుబాటులోకి రానుందని పేర్కొంటూ యాప్ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకూ మొబైల్ నంబర్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లి వేచి చూడాల్సి వచ్చేది. ఇక్కడ క్లిక్ చేసి యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. SHARE IT
News November 28, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

AP: తుఫాన్ కారణంగా రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు హోంమంత్రి అనిత సూచనలు చేశారు. సోమవారం వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉంచాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు.


