News November 3, 2024
మూడు రోజుల్లోనే రూ.107 కోట్ల కలెక్షన్లు

తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ సినిమా వరల్డ్ వైడ్గా మూడు రోజుల్లోనే రూ.107 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన నాలుగో తమిళ నటుడిగా శివ కార్తికేయన్ నిలిచారు. ఈ ఘనత సాధించిన సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్, కమల్ హాసన్ సరసన SK చేరారు. ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మించారు.
Similar News
News November 27, 2025
రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<


