News April 6, 2024

108 రౌండ్ల సూర్య నమస్కార సాధనలో నోవా వరల్డ్ రికార్డ్

image

రుద్రూర్: రథసప్తమి సందర్భంగా ఇండియన్ యోగ అసోసియేషన్ యోగాలయ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ తమిళనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన 108 రౌండ్ల సూర్య నమస్కార సాధనలో రుద్రూర్ యోగ సాధకులు ప్రత్యేకత చాటారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు, కుమారుడు డాక్టర్ విశ్వనాధ్ మహాజన్, అక్షయ శ్రీ, అద్వైత్ మహాజన్ తమ ప్రతిభ తో నోవా వరల్డ్ రికార్డ్, ప్రశంసా పత్రాన్ని సాధించారు.

Similar News

News January 26, 2025

NZB: బాలికల కళాశాల విద్యార్థినికి మొదటి బహుమతి

image

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసాపత్రం తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారిని DIEO రవికుమార్ అభినందించారు.

News January 26, 2025

NZB: తొర్లికొండ ZPHS విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

image

తొర్లికొండ ZPHS విద్యార్థి శ్రావ్య జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-19లో జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈ నెల 24 నుంచి 28 వరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం శంభాజీ నగర్ (మహారాష్ట్ర)లో జరిగే 68వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-19 పోటీల్లో పాల్గొననున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ గంగా మోహన్ తెలిపారు.

News January 26, 2025

NZB: జాతీయ క్రీడలకు డీసీడీఎంగా జిల్లా వాసి

image

ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖాండ్‌లో జరగనున్న నేషనల్ గేమ్స్‌కు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఈగ సంజీవ్ రెడ్డి డిప్యూటీ చీఫ్ డి మిషన్‌గా నియమితులయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరిని డిప్యూటీ చీఫ్ డి మిషన్‌గా నియమించగా జిల్లాకు చెందిన ఈగ సంజీవ్ రెడ్డి నియమితులవడం విశేషం. సంజీవరెడ్డి నియామకంపై జిల్లా క్రీడాసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.