News November 27, 2024
108 సేవలు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు: కలెక్టర్ మహేశ్
వైద్యపరంగా అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్‌ను అభ్యర్థించి రవాణా, వైద్య సంరక్షణను అందించే 108 ఉచిత అత్యవసర సేవలు నిలిచిపోకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన వైద్యరోగ్య శాఖ అధికారులు, 108 సమన్వయ అధికారులతో సమావేశం నిర్వహించారు. 108 వాహన డ్రైవర్లు ధర్నాకు దిగడంతో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 6, 2024
నేటి నుంచి కాకినాడ జిల్లాలో రెవెన్యూ సదస్సులు
గ్రామాల్లో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కాకినాడ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025 జనవరి 8వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు కొనసాగుతాయని చెప్పారు. భూ సమస్యలు ఉన్న రైతులు అర్జీలు అందజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.
News December 6, 2024
9న నన్నయలో బీఈడీ స్పాట్ అడ్మిషన్లు
ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఈనెల 9వ తేదీన బీఈడీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు. బీఈడీ రెండు సంవత్సరాల కోర్సుకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఎడ్-సెట్ 2024 పరీక్ష రాసిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ విద్యార్థులు 40 శాతం, ఓసీ విద్యార్థులు 50 శాతం మార్కులు డిగ్రీలో పొంది ఉండాలన్నారు.
News December 5, 2024
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఎన్నికలు ప్రారంభం
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 16,737 మంది టీచర్లు తమ ఓటు వేయనున్నారు. జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.