News March 1, 2026
108 అంబులెన్స్‌ల్లో ఉద్యోగ అవకాశాలు.. రేపు ఇంటర్వ్యూలు

వరంగల్ జిల్లా 108 సర్వీసుల్లో ఈఎంటీ, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. 30 ఏళ్ల లోపు వయస్సు ఉండి ఎంఎల్టీ, జీఎన్ఎం, ఏఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ అసలు ధృవీకరణ పత్రాలతో ఆదివారం హనుమకొండ కలెక్టరేట్‌లోని 108 కార్యాలయంలో హాజరు కావాలన్నారు.
Similar News
News March 1, 2026
నెల్లూరు GGH ఘటనపై స్పందించిన కలెక్టర్, ఎస్పీ

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఎస్పీ తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని రోగులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని కలెక్టర్ తెలిపారు.
News March 1, 2026
నిఘా నీడలో నెల్లూరు: ఎస్పీ

జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల IPS ఆదేశాల మేరకు పోలీసులు సరికొత్త సాంకేతికతతో డ్రోన్ నిఘాను ముమ్మరం చేశారు. పట్టణ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన భవనాలు, తోటలపై డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. గంజాయి విక్రయాలు, బహిరంగంగా మద్యం తాగడం, పేకాట, ఈవ్ టీజింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News March 1, 2026
రెబ్బెన: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య (UPDATE)

రెబ్బెన మండలం రాజారాం గ్రామానికి చెందిన పూదరి కిరణ్(32) సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కిరణ్- సరిత దంపతులకు 12 ఏళ్ల కుమార్తె ఉంది. కాగా కిరణ్ తాగి వచ్చి భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కిరణ్.. శనివారం రాత్రి ఇంట్లో ఊరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


