News October 8, 2025

108 ఉద్యోగులకు ఉచిత సేవలపై అవగాహన

image

నారాయణపేట జిల్లాలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో 108, 102(అమ్మఒడి) అంబులెన్స్‌లలో పనిచేసే పైలట్‌లు, ఎమర్జెన్సీ టెక్నీషియన్లకు ఉచిత సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణీలను వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

Similar News

News October 9, 2025

నేటి ముఖ్యాంశాలు

image

*నవీ ముంబయిలో ఫుల్లీ డిజిటల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభించిన PM మోదీ
*జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌
*BC రిజర్వేషన్ బిల్లుపై విచారణ రేపటికి వాయిదా
*కల్తీ లిక్కర్ అని ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు: CM చంద్రబాబు
*AP: కోనసీమ(D) బాణసంచా కేంద్రంలో మంటలు చెలరేగి ఏడుగురు మృతి
*దగ్గు సిరప్ రా మెటీరియల్స్‌‌, ఫైనల్ ప్రొడక్ట్స్‌ క్షుణ్నంగా టెస్ట్ చేయాలన్న కేంద్రం

News October 9, 2025

ఆ లక్ష్య సాధనకు టీచర్ల సహకారం అవసరం: లోకేశ్

image

AP: టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మ్యూచువల్, స్పౌజ్ బదిలీలతో పాటు భాషా పండితులకు పదోన్నతులు దక్కిన నేపథ్యంలో ఆయన్ను పలువురు టీచర్లు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విద్యాశాఖలో తొలి ఏడాది సంస్కరణలు పూర్తి చేశాం. వచ్చే నాలుగేళ్ల పాటు ఫలితాలపైనే దృష్టిసారిస్తాం. విద్యావ్యవస్థను నం.1గా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం. ఇందుకు టీచర్ల సహకారం కావాలి’ అని అన్నారు.

News October 9, 2025

ఇండియన్స్ ఎందుకు క్లీన్‌గా ఉండరు: నటి

image

ముంబైలోని జుహు, బ్రెజిల్‌లోని రియో బీచ్‌లను పోల్చుతూ నటి, వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘జుహు కంటే రియో బీచ్‌ కిక్కిరిసిపోయింది. ఇంతమంది ఉన్నా ఎంత క్లీన్‌గా ఉంది. ఇండియన్స్ ఎందుకు క్లీన్‌గా ఉండరు?’ అని ఓ వీడియో షేర్ చేసింది. ఇండియన్స్‌ను అవమానించారంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. ‘తను చెప్పిన దాంట్లో తప్పేముంది. ముందు మనం మారాలి’ అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.