News April 6, 2024
108 రౌండ్ల సూర్య నమస్కార సాధనలో నోవా వరల్డ్ రికార్డ్
రుద్రూర్: రథసప్తమి సందర్భంగా ఇండియన్ యోగ అసోసియేషన్ యోగాలయ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ తమిళనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన 108 రౌండ్ల సూర్య నమస్కార సాధనలో రుద్రూర్ యోగ సాధకులు ప్రత్యేకత చాటారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు, కుమారుడు డాక్టర్ విశ్వనాధ్ మహాజన్, అక్షయ శ్రీ, అద్వైత్ మహాజన్ తమ ప్రతిభ తో నోవా వరల్డ్ రికార్డ్, ప్రశంసా పత్రాన్ని సాధించారు.
Similar News
News December 25, 2024
NZSR: భార్యను కత్తితో నరికి చంపిన భర్త
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో బుధవారం దారుణం జరిగింది. మండలంలోని అవుసుల తండాలో నివాసం ఉంటున్న మెగావత్ మోతి బాయి(55)ని భర్త షేర్య కత్తితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు సంబంధిచిన పూర్తి వివరాలను తరువాత వెల్లడించనున్నట్లు ఎస్సై తెలిపారు.
News December 25, 2024
చందూర్: బాధిత కుటుంబాలకు చెక్కుల అందజేత
చందూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. లక్ష్మాపూర్ లో ఇద్దరికి, చందూర్ లో ఒకరికి, మేడిపల్లి గ్రామానికి చెందిన ఒకరికి చెక్కులను పంపిణీ చేశార. కార్యక్రమంలో మాజీ సర్పంచులు సాయ రెడ్డి, సత్యనారాయణ, రవి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
News December 25, 2024
నిజామాబాద్ జిల్లా BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?