News November 21, 2024

10వేల+ అప్లికేషన్స్ వచ్చాయి: జొమాటో CEO

image

జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్‌కు 10వేల కంటే ఎక్కువ <<14666126>>అప్లికేషన్స్<<>> వచ్చినట్లు సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. ఇందులో రకరకాల వ్యక్తులున్నట్లు తెలిపారు. చాలా డబ్బున్నవారు, కాస్త డబ్బు ఉన్నవారు, తమ వద్ద చెల్లించేందుకు డబ్బులు లేవని చెప్పినవారు, నిజంగానే డబ్బుల్లేని వారు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్లికేషన్‌కు సాయంత్రం 6 వరకే ఛాన్స్ ఉందన్నారు. కాగా ఈ పోస్టు కోసం రూ.20లక్షలు విరాళం ఇవ్వాలి.

Similar News

News November 21, 2024

ఉద్యోగులకు భారీ షాకివ్వనున్న ఓలా ఎలక్ట్రిక్!

image

ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాకివ్వనుందని సమాచారం. 500 మందికి పైగా తొలగించనుందని తెలుస్తోంది. మార్జిన్లను మెరుగుపర్చుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. అందుకే రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ఆరంభించినట్టు తెలిసింది. 2022, సెప్టెంబర్, జులైలోనూ కంపెనీ రెండుసార్లు ఇలాగే చేసింది. యూజుడ్ కార్స్, క్లౌడ్ కిచెన్, గ్రాసరీ డెలివరీ యూనిట్లను మూసేసి 1000 మందిని ఇంటికి పంపించేసింది.

News November 21, 2024

హోంమంత్రికే రక్షణ లేకపోతే ఎలా?: సీఎం చంద్రబాబు

image

AP: తల్లి, చెల్లిని SMలో అసభ్యంగా దూషించినా గత సీఎం పట్టించుకోలేదని CM చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికీ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రస్తుతం హోంమంత్రి, డిప్యూటీ సీఎంపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. దళిత మహిళ అయిన హోంమంత్రికే రక్షణ లేకుండా పోతే ఎవరికుంటుంది? కొందరికి డీజీపీ, మంత్రులైనా లెక్కలేకుండా పోయింది. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.

News November 21, 2024

ఫస్ట్ టెస్టుకు అంపైర్లు వీళ్లే

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీ వ్యవహరిస్తారు. థర్డ్ అంపైర్‌గా ఇల్లింగ్‌వర్త్, ఫోర్త్ అంపైర్‌గా సామ్ నోగాజ్‌స్కీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇదిలా ఉంటే <<12115864>>కెటిల్‌బరో<<>> అంపైరింగ్ చేయనున్నారని తెలియడంతో కొందరు అభిమానులు ‘మన టీమ్ మరింత కష్టపడాల్సిందే’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.