News April 30, 2024

10TH రిజల్ట్స్.. పాలమూరులో 45,350 విద్యార్థులు

image

పదోతరగతి ఫలితాలు ఇవాళ ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. కాగా MBNR జిల్లాలో మొత్తం 12,866, NGKL 10,526, WNP-6,903, NRPT-7,678, గద్వాల 7,377 మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

Similar News

News December 29, 2025

MBNR: ఆపరేషన్ స్మైల్-XII.. సమన్వయ సమావేశం

image

మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు సోమవారం అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం అధ్యక్షతన ‘ఆపరేషన్ స్మైల్-XII’ నిర్వహణకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం మాట్లాడుతూ.. 2026 జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 28, 2025

MBNR: SSC, INTER.. అప్లై చేసుకోండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరెందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. వచ్చేనెల 5లోగా.. ఫైన్‌తో 16లోగా అప్లై చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. www.telanganaopenschool.org వెబ్ సైట్ సందర్శించాలన్నారు. SHARE IT

News December 28, 2025

ALERT: చైనా మాంజా.. సమాచారం ఇవ్వండి: SP

image

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించి చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా మానేయాలని, ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.