News November 8, 2024
పదో తరగతి పరీక్షల ఫీజు తేదీల ప్రకటన
TG: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు గడువు ఇచ్చింది. రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో DEC 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు చెల్లించవచ్చని పేర్కొంది.
Similar News
News December 27, 2024
ఆస్పత్రి నుంచి అద్వానీ డిశ్చార్జి
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ (97) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపారు. కాగా కొద్ది రోజులుగా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12న ఆయన ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డా.వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందించగా పూర్తిగా కోలుకున్నారు.
News December 27, 2024
ఆస్పత్రిలో మన్మోహన్ సింగ్.. చివరి ఫొటో
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఆయన ఆస్పత్రిలో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తలపాగా, గడ్డం లేకుండా ఆయన కనిపించారు. కాగా మన్మోహన్ కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
News December 27, 2024
మన్మోహన్ను రాజకీయాల్లోకి తెచ్చింది పీవీనే
RBI గవర్నర్గా ఉన్న మన్మోహన్కు రాజకీయాలు పరిచయం చేసింది PV నరసింహారావు అనే చెప్పాలి. 1991లో దుర్భర ఆర్థిక పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి సింగ్ను రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిని చేశారు. Liberalisation, Privatisation, Globalisation పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయి.