News November 29, 2024
10th CLASS: గ్రేడింగ్స్, ర్యాంకింగ్స్‌లో ఏది కావాలి?
పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్ బదులు ర్యాంకింగ్/మార్కుల సిస్టమ్ తీసుకొచ్చిన TG నిర్ణయంపై భారీ చర్చ జరుగుతోంది. ఇంతకీ స్టూడెంట్స్, వారి పేరెంట్స్ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకున్నారో లేదో తెలియడం లేదు. చదువుల భారం, పేరెంట్స్, టీచర్స్ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతోనే తెలుగు రాష్ట్రాలు గ్రేడింగ్ వైపు వెళ్లాయి. మళ్లీ పాత పద్ధతైన మార్కుల వైపు వెళ్లడం కరెక్టేనా? మీరేమంటారు?
Similar News
News November 29, 2024
గుండె లేకపోయినా..!
ఎవరైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటే ‘అబ్బా.. నీకు హార్ట్ లేదబ్బా’ అని ఎదుటి వ్యక్తులు అంటుంటారు. అయితే, నిజంగానే హార్ట్ లేని వ్యక్తి గురించి మీకు తెలుసా? 2011లో క్రైగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తికి అమిలోయిడోసిస్ కారణంగా గుండె, కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయ్యాయి. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు అతనికి గుండెకు బదులు ఓ పరికరాన్ని అమర్చి మరికొన్నిరోజులు బతికేలా చికిత్స చేశారు.
News November 29, 2024
సమంత తండ్రి మృతి
టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తూ ఆమె అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
News November 29, 2024
బీమారంగంలో 100% FDIకి కేంద్రం సై!
భారత బీమా కంపెనీల్లో FDI పరిమితిని 74 నుంచి 100 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. వేర్వేరు బీమా వ్యాపారాలను నిర్వహించేందుకు కంపెనీలకు అనుమతించాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఇక అన్ని కంపెనీలూ లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ సేవల్ని అందించేందుకు వీలవుతుంది. ఇక ఫారిన్ రీఇన్సూరర్స్ సొంత నిధుల అవసరాన్ని రూ.5000 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది.