News April 30, 2024

10th Results: నారాయణపేటలో 93.13% పాస్

image

టెన్త్ ఫలితాల్లో నారాయణపేట సత్తాచాటింది. 93.13 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 15వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 7129 మంది పాసయ్యారు. MBNR(89.47%) 28వ స్థానంలో నిలవగా 11338 ఉత్తీర్ణత సాధించారు. NGKL(91.57) 23వ స్థానంలో ఉండగా 9621 పాసయ్యారు. WNP(86.93) 29వ స్థానంలో నిలవగా 5988 ఉత్తీర్ణత సాధించగా.. GDL(81.38) 32న స్థానంలో ఉండగా 5839 మంది పాసయ్యారు.

Similar News

News January 3, 2025

నల్లమల విద్యార్థికి బంగారు పతకం 

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలంలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. భరత్ ప్రస్తుతం అచ్చంపేట రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు. 

News January 2, 2025

బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ 

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కృష్ణ మనోహర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కృష్ణ మనోహర్ గౌడ్ చేసిన సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించినట్లు నరేందర్ గౌడ్ వెల్లడించారు.

News January 2, 2025

అమరచింత: నిలిచిన జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందు గురువారం ఇన్ఫ్లోనిలిచిపోయింది. దీనితో వచ్చే జూన్ వరకు వర్షాలు లేకపోవడంతో తాగునీటికి కష్టాలు తప్పేటట్లు లేదు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 4.091 టీఎంసీలు, ఆవిరి ద్వారా 29 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 500, మొత్తం అవుట్ స్లో 342 క్యూసెక్కులు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ వెంకటేశ్వరరావు వివరించారు.