News April 23, 2025
10th Results :17వ స్థానంలో నంద్యాల జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నంద్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 24,496 మంది పరీక్ష రాయగా 20,051 మంది పాసయ్యారు. 12,702 మంది బాలురులో 10,097 మంది, 11,794 మంది బాలికలు పరీక్ష రాయగా 9,954 మంది పాసయ్యారు. 81.85 పాస్ పర్సంటేజ్‌తో నంద్యాల జిల్లా 17వ స్థానంలో నిలిచింది.
Similar News
News April 23, 2025
రాజమండ్రిలో 25న మెగా జాబ్ మేళా

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి తెలిపారు. APSSDC & ప్రభుత్వం కళశాల (A) రాజమండ్రి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉ.9:30 గంటలకు ప్రారంభమవుతుందని, సుమారు 30కు పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయని,యువత సద్వినియోగం చేసుకొవాలన్నారు.
News April 23, 2025
GDK: రాష్ట్రస్థాయిలో ర్యాంకు.. అధికారుల సన్మానం

గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివిన స్ఫూర్తి అనే విద్యార్థిని ఇంటర్ HICవిభాగంలో 978/1000 అత్యధిక మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. ఇంటర్మీడియట్ పెద్దపల్లి జిల్లా నోడల్ అధికారి కల్పన, అడిషనల్ కలెక్టర్ వేణు చేతుల మీదుగా విద్యార్థిని సన్మానించారు. అధ్యాపకులు సంపత్, నరేష్, శంకర్ ఉన్నారు.
News April 23, 2025
ఖమ్మం: 5.8 కేజీల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

ఖమ్మం జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. ఏదులాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడులోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీల నుంచి సుమారు 5.880 కేజీల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని, నిందితుడు బానోత్ హరియాను అరెస్టు చేశారు. నిందితుడు ఒడిశాలో గంజాయి చాక్లెట్లను కొని ఖమ్మం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, నరసింహ ఉన్నారు.