News April 23, 2025
10th Results: 23వ స్థానంలో అనంతపురం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 30,700 మంది పరీక్ష రాయగా 21,510 మంది పాసయ్యారు. 15,733 మంది బాలురులో 10,315 మంది, 14,967 మంది బాలికలు పరీక్ష రాయగా 11,195 మంది పాసయ్యారు. 70.07 పాస్ పర్సంటైల్‌తో అనంతపురం జిల్లా 23వ స్థానంలో నిలిచింది.
Similar News
News December 14, 2025
కేఎల్ స్వామి దాస్‌కు డాక్టర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు

గుంతకల్లుకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ ఢిల్లీలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు’ను అందుకున్నారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. మాదిగలు, అణగారిన కులాల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లకు పైగా చేసిన నిస్వార్థ సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు స్వామి దాస్ పేర్కొన్నారు.
News December 13, 2025
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.