News April 23, 2025

10th RESULTS: మూడో స్థానంలో విశాఖ జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశాఖ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 28,435 మంది పరీక్ష రాయగా 25,346 మంది పాసయ్యారు. 15,045 మంది బాలురులో 13,288(88.32%) మంది, 13,390 మంది బాలికలు పరీక్ష రాయగా 12,058(90.05%) మంది పాసయ్యారు. 89.14 పాస్ పర్సంటైల్‌తో విశాఖ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. గతేడాది 8వ స్థానంలో నిలవగా ఈసారి ఐదు స్థానాలు మెరుగుపడింది.

Similar News

News April 23, 2025

విశాఖలో వైశ్యరాజు జువెలర్స్‌ షోరూం ప్రారంభం

image

విశాఖలోని ఆశీల్‌మెట్ట, సంపత్ వినాయక దరిలో వైశ్యరాజు జువెలర్స్‌ 18KT గోల్డ్ షోరూంను ప్రారంభించినట్లు MD వైశ్యరాజు తెలిపారు. వినయగర్ ప్యారడైజ్, భూస్వాములు లగడపాటి కిరణ్ కుమార్, మంత్రి శేషగిరిలు, నగేశ్‌లతో కలిసి షోరూంను ప్రారంభించారు. ఇండియాలో మొట్టమొదటి 18KT గోల్డ్ షోరూం ఇదేనని MD వైశ్యరాజు పేర్కొన్నారు. 18KT జువెలరీపై తరుగు(VA) 6% నుంచి ఉంటుందన్నారు. ఛైర్మన్ ఫల్గుణరాజు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

News April 23, 2025

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు

image

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 28 రోజులకు గాను ఆలయ అధికారులు ఈవో సుబ్బారావు పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. మొత్తం రూ.1,81,41,219 ఆదాయం వచ్చింది. బంగారం 145.100 గ్రాములు, వెండి 11.250 కిలోలు, 8 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

News April 23, 2025

విశాఖ: 600కి 598 మార్కులు

image

పెందుర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన అబ్దుల్ సమీరా భాను బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలల్లో సత్తా చాటింది. 600 మార్కులకు గాను 598 మార్కులు వచ్చాయి. పెందుర్తి మండలంలో 598 మార్కులు రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థిని పలువురు అభినందించారు.

error: Content is protected !!