News December 18, 2024
10th హాల్ టికెట్లో తప్పులు సవరణకు అవకాశం: DEO
10వ తరగతి పరీక్షా హాల్ టికెట్లలో తప్పులను ఈనెల 19 నుంచి 23వరకు సరిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇటీవల ఆన్లైన్లో చేసిన 10వ తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఉంటే సరిచేసుకోవాలని విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాలన్నారు.
Similar News
News February 5, 2025
నగ్న వీడియోలతో బెదిరింపులు.. గుంటూరు వ్యక్తిపై కేసు
సాఫ్ట్వేర్ యువతులను ట్రాప్ చేసి వీడియో కాల్స్ రికార్డ్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి గుంటూరు, నల్లచెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బీటెక్ నుంచే అడ్డదారి పట్టాడని, నిందితుడు తండ్రి మస్తాన్ దర్గాకు వారసత్వ ధర్మకర్త కాగా మస్తాన్ వద్ద 80పైగా వీడియో కాల్స్ దృశ్యాలు ఉన్నాయన్నారు.
News February 5, 2025
తెనాలి: రైలు నుంచి జారిపడి వాచ్ మెన్ మృతి
రైలు నుంచి జారి పడి గాయాలపాలైన ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చీరాలకు చెందిన భాస్కర్(48) నిడుబ్రోలులోని రైతుబజార్లో వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రైలులో ప్రయాణిస్తూ తెనాలి స్టేషన్లో రైలు నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు వైద్యశాలకు పంపగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 5, 2025
బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు: డీఎస్పీ
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీ కృష్ణ తాడేపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సీతానగరం, మహానాడు వరకు నడుచుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.