News July 9, 2024

10న చిత్తూరులో మెగా జాబ్ మేళా

image

చిత్తూరు పట్టణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 21, 2024

రామసముద్రం: హౌసింగ్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

image

రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీలోని హౌసింగ్ లేఔట్ ను శనివారం హౌసింగ్ డిఈ రమేష్ రెడ్డి, ఎంపీడీవో భానుప్రసాద్ పరిశీలించారు. పెండింగులో ఉన్న గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈ సూచించారు. పునాదులు, గోడల వరకు ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసినట్లయితే వెంటనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు.

News December 21, 2024

కుప్పానికి రూ.451 కోట్లు.. జీవో ఇచ్చి మళ్లీ రద్దు

image

CM చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అభివృద్ధికి ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ కింద రూ.456 కోట్లు మంజూరు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. కుప్పం పరిధిలో 130 KM మేర అండర్ డ్రైనేజ్‌, 11 అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించాలని ఆదేశించింది. నిన్న రాత్రే ఈ జీవోను రద్దు చేసింది. పనుల్లో కొన్ని మార్పులు చేసి మరోసారి జీవో ఇస్తారని సమాచారం.

News December 21, 2024

త్వరలో ‘టైమ్స్ ఆఫ్ చిత్తూరు’ సినిమా

image

తాను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్తూరు ఎలా ఉందనే అంశంపై సినిమా తీస్తున్నట్లు MLA జగన్ మోహన్ ప్రకటించారు. ఇందులో వివిధ పార్టీల రాజకీయ నాయకుల ప్రస్తావన ఉంటుందని చెప్పారు. ‘టైమ్స్ ఆఫ్ చిత్తూరు’ పేరిట వచ్చే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పాత్రలు, స్వభావాలు అంటూ ఇందులో సీకే బాబు, బుల్లెట్ సురేశ్, విజయానందరెడ్డి తదితరుల పేర్లతో కూడిన పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి.