News April 23, 2025
11వ స్థానానికి ఎగబాకిన పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లా పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి 25,382 మంది విద్యార్థులలో 21,358 మంది ఉత్తీర్ణత సాధించారు. 84.15 శాతం పాస్ పర్సంటైల్ నమోదు అయింది. గతేడాది 86.05 శాతంతో 18వ స్థానంలో ఉన్న జిల్లా, ఈసారి 11వ స్థానానికి ఎగబాకడం గమనార్హం. విద్యార్థులు, అధ్యాపకుల కృషికి ఫలితంగా ఈ పురోగతి సాధ్యమైందని అధికారులు అభిప్రాయపడ్డారు.
Similar News
News April 23, 2025
స్కూళ్లకు సెలవులు షురూ

ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఇవాళ చివరి వర్కింగ్ డే ముగిసింది. రేపటి నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. ప్రస్తుతం ఎండలు ముదిరినందున పిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయటికెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే ఈత కోసం చెరువులు, కాల్వల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలి.
News April 23, 2025
ఎన్టీఆర్: ప్రధాని మోదీ పర్యటనకు 120 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాట్లు

మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా CRDA అధికారులు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. సెక్రటేరియట్ సమీపంలో సభ జరిగే ప్రాంగణాన్ని 28 ఎకరాల్లో అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్టేజి వెనుక 10 ఎకరాలు, సమీపంలో 32 ఎకరాలలో VIPల వాహనాల పార్కింగ్‌కు స్థలం చదును చేసి సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలు తరలి వచ్చే బస్సులకు 110 ఎకరాలలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
News April 23, 2025
ఎన్టీఆర్: ప్రధాని పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించిన అధికారులు

మే 2న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సంబంధిత రూట్ మ్యాప్‌ను అధికారులు బుధవారం పరిశీలించారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌కు అనుసంధానమై ఉన్న సీడ్ యాక్సిస్ రహదారుల జంక్షన్‌లను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ చంద్, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్, NHAI ప్రాజెక్టు డైరక్టర్ పార్వతీశం,CRDA అధికారులతో కలసి ఆయా రహదారులను రూట్ మ్యాప్ నిమిత్తం పరిశీలించారు.