News February 12, 2025
11 నామినేషన్లు తిరస్కరణ: ఎన్నికల అధికారి

పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి మంగళవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరో 43 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించామన్నారు. అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలన చేసామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకురాలు సునీత ఉన్నారన్నారు.
Similar News
News March 27, 2025
ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్

TG: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉందని, కానీ పెంచలేదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే పెంచలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో దక్షిణాది నుంచి లోక్‌సభలో 24 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడి పోరాటం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
News March 27, 2025
కడప: 98 ఏళ్ల వయసులోనూ ఓటేసిన జడ్పీటీసీ

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఓ స్ఫూర్తిదాయక దృశ్యం కనిపించింది. గురువారం కడప నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఛైర్మన్ ఎన్నికలో ఉమ్మడి కడప జిల్లా గాలివీడు జడ్పీటీసీ షేక్ భానూ బీ 98ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలో ప్రతి ఓటు కీలకం అయిన నేపథ్యంలో ఆమె ఓటు వేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
News March 27, 2025
సంగారెడ్డి: ‘జిల్లాలో బడి లేని ఆవాసాలు 335’

సంగారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సీఆర్పీలు నిర్వహించిన సర్వేలో 335 ఆవాస ప్రాంతాలలో బడులు లేనట్లుగా గుర్తించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష పరిధిలోని సీఆర్పీలు క్షేత్ర స్థాయికి వెళ్లి సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలు లేని ఆవసాలు 5, ప్రాథమికోన్నత పాఠశాలలు లేని ఆవసాలు 190, ఉన్నత పాఠశాలలు లేనివి 140గా గుర్తించారు.