News May 10, 2024

11 సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెర

image

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 11న సాయంత్రం తమ ప్రచారాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన శుక్రవారం తెలిపారు. ప్రచారాలు నిలిపివేసిన సమయం నుండి పోలింగ్ పూర్తయ్యేంతవరకు మద్యంపై నియంత్రణ ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, యువ ఓటర్లు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News October 16, 2025

NLG: గాడి తప్పుతున్న విద్యాశాఖ..!

image

NLGలో విద్యాశాఖ గాడి తప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, పట్టింపు లేమి వెరసి ఆ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరేళ్లుగా రెగ్యూలర్ DEO లేకపోవడంతో ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం FAC DEO బిక్షపతి అసలు పోస్టు వరంగల్ (D) లష్కర్ బజార్ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్ గ్రేడ్-1 గెజిటెడ్ హెడ్ మాస్టర్. 2019 OCTలో డిప్యూటేషన్‌పై ఇక్కడికి వచ్చారు.

News October 16, 2025

NLG: రేపే జాబ్ మేళా

image

రేపు ఉదయం 10.30 గంటలకు నల్గొండలోని ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. జిల్లాలో పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ (అన్ని ట్రేడ్ల)లో ఉత్తీర్ణత పొందిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News October 16, 2025

NLG: వేరుశనగ.. సాగు పెంపే లక్ష్యం..!

image

జిల్లాలో ఏటేటా తగ్గిపోతున్న వేరుశనగ పంటల సాగును పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో రెండు 2,22,444 హెక్టార్లలో పంట సాగు చేయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. రైతులకు ఉచితంగా విత్తనాలు అందించనున్నారు. పంట నూనెల ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.