News December 28, 2024
11 సీట్లు వచ్చినా దాడులు చేస్తుంటే ఉపేక్షించం: పవన్

YS జగన్ తన పార్టీ వర్గాలను నియంత్రించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 11 సీట్లు వచ్చినా ఇంకా దాడులు చేస్తుంటే మేము ఉపేక్షించమన్నారు. రాయలసీమ యువత ఇలాంటివి జరిగినప్పుడు ఎదుర్కోవాలని, మేము అండగా ఉంటామని నాయకులకు సైతం పవన్ భరోసానిచ్చారు. ఈరోజు మీరు భయపడటం వలనే జవహర్ బాబుపై దాడి జరిగిందన్నారు. పోలీసులే కాదు జనం కూడా ఇలాంటి వాటిపై స్పందించాలని, ఓట్లు వేసి పనైపోయిందని అనుకోకూడదన్నారు.
Similar News
News December 19, 2025
కడప: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

మంచిగా ఉండమని చెప్పినందుకు బంధువు నరసింహుడిని చంపిన నిందితుడు నాగరాజుకు శుక్రవారం ప్రొద్దుటూరు కోర్టు యావజ్జీవ శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. నిందితుడు తన బంధువును 2021లో జమ్మలమడుగులోని ఓ తోటలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో జడ్జి సత్యకుమారి శుక్రవారం శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News December 19, 2025
ప్రొద్దుటూరులో నేడు బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలను వ్యాపారులు వెల్లడించారు.
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13,220.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.12,162.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.1,980.00
News December 19, 2025
కడపలో వారి గన్ లైసెన్సుల రద్దు..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోని గన్ లైసెన్స్లపై దృష్టి సారించారు. లైసెన్స్ పొందిన వారి గురించి ఆరా తీస్తున్నారు. వారిపై కేసుల వివరాలు, నేర చరిత్రను పరిశీలిస్తున్నారు. జిల్లాలో సుమారు 850 దాకా గన్ లైసెన్స్లు ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సమస్యలు సృష్టించే వారి గన్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయనున్నారు.


