News March 9, 2026
11 రోజుల్లో నాన్‌స్టాప్‌గా 13వేల కిలోమీటర్ల జర్నీ!

B6 అనే 4 నెలల బార్ టెయిల్డ్ గాడ్‌విట్ పక్షికి 11 రోజుల్లోనే నిర్విరామంగా 13,560km ప్రయాణించిన ప్రపంచ రికార్డ్ ఉంది. జర్నీకి ముందు అలాస్కాలో ఎక్కువ ఆహారం తిని కొవ్వును పెంచుకుంది. ప్రయాణంలో అవయవాల సైజ్‌ను తగ్గించుకొని కొవ్వును కరిగించుకుంటూ శక్తిని తెచ్చుకునేది. ఎగురుతూనే మెదడులో సగభాగాన్ని అలర్ట్‌గా ఉంచి నిద్రపోయేది. భూఅయస్కాంత శక్తి ఆధారంగా దిక్కులు గుర్తిస్తూ మెరుగైన ఆహారం కోసం AUS చేరుకుంది.
Similar News
News April 14, 2026
T20 కెప్టెన్‌గా సూర్య కొనసాగుతారా?

భారత T20 కెప్టెన్‌గా సూర్య ఎప్పటివరకు కొనసాగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన కెప్టెన్సీలోనే భారత్ T20 WC గెలిచింది. కానీ బ్యాటింగ్‌లో ఆయన తడబడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్, జులైలో ENG, IREతో జరిగే T20 సిరీస్‌లలో ఆయన ఎలా ఆడతారనే దానిపైనే ఫ్యూచర్ ఆధారపడి ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సిరీస్‌లలో రాణిస్తే ఆయన 2028 ఒలింపిక్స్ వరకూ కెప్టెన్‌గా కొనసాగే అవకాశముందని అంటున్నారు.
News April 14, 2026
కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టేలా పరీక్షలు: మంత్రి

AP: ఉద్ధానం వాసులను పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టి ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘‘బయోమార్కర్స్’ ద్వారా జన్యు, రక్త, మూత్ర పరీక్షలను ప్రత్యేక బృందాలతో నిర్వహిస్తున్నాం. ఇందుకు ICMR ₹6.2CR ఇచ్చింది. వ్యాధి వచ్చే అవకాశాలను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. పలాస రీసెర్చ్ కేంద్రం సహా విశాఖ KGHలో ప్రత్యేక ల్యాబ్‌లు నెలకొల్పాం’ అని తెలిపారు.
News April 14, 2026
20 ఏళ్ల పాటు సీఎం.. నేటితో ముగిసిన శకం

బిహార్‌లో దాదాపు 20 ఏళ్ల పాటు CMగా కొనసాగిన నితీశ్ <<19649099>>శకం<<>> నేటితో ముగిసింది.
*తొలిసారి 2000లో 7 రోజులు
*2005-10 వరకు 1,827 రోజులు
*2010-14 వరకు 1,270 రోజులు
*2015లో 270 రోజులు
*2015 నుంచి 2017 వరకు 614 రోజులు
*2017 జులై నుంచి 2020 వరకు 1,204 రోజులు
*2020 NOV నుంచి 2022 వరకు 631 రోజులు
*2022 AUG నుంచి 2024 వరకు 536 రోజులు
*2024 నుంచి 2025 వరకు 661 రోజులు
*2025 NOV నుంచి 2026 APR వరకు 146 రోజులు


