News December 16, 2024
జార్జియాలో 11 మంది భారతీయుల మృతి

జార్జియాలోని గుడౌరిలో ఉన్న ప్రముఖ స్కీ రిసార్టులో విషవాయువులు లీకై 11 మంది భారతీయులు మృతి చెందారు. భారతీయ రెస్టారెంట్ ఉన్న భవనంలోని రెండో అంతస్తులో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. డెడ్‌బాడీలపై ఎటువంటి గాయాలు లేవని తేలింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత పవర్ జనరేటర్‌ను ఆన్ చేయడం వల్ల విడుదలైన విషవాయువుల (కార్బన్ మోనాక్సైడ్) కారణంగా మరణాలు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.
Similar News
News January 28, 2026
ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ

AP: పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెల పెన్షన్‌ను జనవరి 31వ తేదీనే పంపిణీ చేయనుంది. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జనవరి 30నే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే.
News January 28, 2026
రిటైర్మెంట్ వెనుక కారణం చెప్పిన అర్జిత్ సింగ్

బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు <<18977435>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొత్త తరం గాయకులకు అవకాశాలు కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. సినిమాలకు గుడ్‌బై చెప్పినా, ఇండిపెండెంట్ సింగర్‌గా తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News January 28, 2026
అలసంద మొక్కల ఆకులను పురుగులు తినేస్తున్నాయా?

అలసంద పంటను ఆకు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగులు ఆకులను తినేయడం వల్ల మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. వీటి తీవ్రత పెరిగితే దిగుబడిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 5ml వేప గింజల కషాయాన్ని లేదా లీటరు నీటికి 3ml అజాడిరక్టిన్ (3000 PPM) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


